తెలంగాణ

telangana

ETV Bharat / state

'అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్' - తెదేపా అఖిల ప్రియ తాజా వార్తలు

ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని.. ఎన్ని కష్టాలు వచ్చినా మనోనిబ్బరంతో ముందుకెళ్లాలని సూచించారు.

ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్ కాల్
ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్ కాల్

By

Published : Jan 23, 2021, 10:43 PM IST

బెయిల్​పై జైలు నుంచి విడుదలైన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మనోనిబ్బరంతో ముందుకు సాగాలని తెలిపారు. ధైర్యంగా ఉంటూ తోటివారికీ ధైర్యం చెప్పాలన్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని అఖిలకు చంద్రబాబు సూచించారు.

హైదరాబాద్​లోని బోయిన్‌పల్లి అపహరణ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ... శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు సికింద్రాబాద్ కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శనివారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి అఖిలప్రియ విడుదలయ్యారు.

ఇదీ చూడండి: ఫిలింనగర్​ ఆలయంలో అఖిలప్రియ పూజలు

ABOUT THE AUTHOR

...view details