ఆంధ్రప్రదేశ్లో వైద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండంటూ ఓ రోగి తీసిన వీడియోను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ల యువకుడు తన తల్లిని కాపాడాలని, తన ప్రాణాలు నిలపమంటూ హృదయవిదారకంగా వేడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉండి ఏం లాభమని చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళం రిమ్స్ లో ఉన్న ఆ యువకున్ని తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం' - facilities in srikakulam rims
ఏపీ ప్రభుత్వాస్పత్రుల్లో సేవలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన తల్లిని కాపాడాలని ఓ యువకుడు దయనీయంగా వేడుకుంటున్న వీడియోను ట్విటర్ల్లో పోస్ట్ చేశారు. ఆ యువకుడిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం'