విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్... తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టే ప్రతిపాదనపై మాట్లాడాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంట్లో వాళ్లకే జగన్ వెన్నుపోటు పొడిచారా? అని నిలదీశారు. పార్టీ పెడుతున్నామని షర్మిల చెబుతుంటే.. ఏ2 మాత్రం లేదంటున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో షర్మిల పార్టీపై.. చంద్రబాబు ఏమన్నారంటే? - ఏపీలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ వార్తలు
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టే విషయంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఆనాడు జగనన్న వదిలిన బాణం విశ్వసనీయత ఏమైందని ప్రశ్నించారు.
తెలంగాణలో షర్మిల పార్టీపై.. చంద్రబాబు ఏమన్నారంటే?
ఆనాడు జగనన్న వదిలిన బాణం విశ్వసనీయత.. ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. బాబాయ్ హత్య కేసును జగన్ ఇంకా తేల్చలేదన్న చంద్రబాబు.. నాడు జగన్ సీబీఐ కావాలి అని.. ఇప్పుడు వద్దు అంటున్నారని ధ్వజమెత్తారు. నాడు వివేకా కూతురు, నేడు షర్మిల.. పోరాడుతున్నారని తెలిపారు.
ఇదీ చదవండి:మేం తల్చుకుంటే మీరు మిగలరు: కేసీఆర్