Chandanagar Suicide Case News :నేటికాలంలో చిన్న చిన్న కారణాలతో, క్షణికావేశంలో చాలా మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా తట్టుకోలేకపోతున్నారు. ప్రేమ విఫలమైందని ఒకరు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పులు పెరిగిపోయాయని, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయని, కుటుంబంలో సమస్యలను తట్టుకోలేక ఇలా చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న వారిని విషాదంలో నెట్టేస్తున్నారు.
Young Man Suicide Chandanagar Today :మరీముఖ్యంగా యువత తెలిసీ తెలియని వయసులో చిన్న సమస్య వచ్చినా చావే శరణ్యమని నిర్ణయించుకుంటున్నారు. ఇలా చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్న వారు, కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన పెళ్లికి పెట్టిన ఖర్చులు తిరిగివ్వాలని అన్నా-వదినలు పెడుతున్న వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Six People Suicides in One Day in Hyderabad : హైదరాబాద్‌లో ఆత్మహత్యల అలజడి.. రెండు ఫ్యామిలీలు.. ఆరుగురి బలవన్మరణాలు
చందానగర్ పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం,శేరిలింగంపల్లి తారానగర్ ప్రాంతానికి చెందిన శరత్ చారి (23) తన అన్న కృష్ణాచారి వద్ద బంగారం పని చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సనత్నగర్ ప్రాంతానికి చెందిన చందన శ్రీనితో శరత్ వివాహం జరిగింది. అన్నయ్య కృష్ణా చారి ఖర్చులు భరించి వారిద్దరికీ వివాహం జరిపించాడు. అయితే ఇటీవల అన్న కృష్ణా చారి, వదిన ప్రమీలలు పెళ్లికి పెట్టిన ఖర్చు డబ్బులు మొత్తం తిరిగివ్వాలని శరత్ చారిని తీవ్రంగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో శరత్ తన దగ్గర ఉన్న బంగారం అన్నా వదినలకు ఇచ్చాడు.
Young Man Suicide Due to Family Problems :అయినా మిగిలిన మొత్తం ఇవ్వాలని అన్నావదినలు శరత్ను తీవ్ర వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలో శరత్ చారి మరో ఉద్యోగం చూసుకున్నాక తీసుకొస్తానని చెప్పి భార్యను పుట్టింటికి పంపాడు. కృష్ణా చారి దంపతులు మిగిలిన డబ్బుల కోసం శరత్ చారితో పాటు అతని భార్యకు ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గురువారం శరత్ చారి విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న శరత్ చారి భార్య చందన శ్రీని చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Suicides in Hyderabad : హైదరాబాద్‌లో ఆత్మహత్యల అలజడి.. 25 రోజుల్లోనే ఏకంగా..!
లేడీసే కదా అని లిఫ్ట్ ఇస్తున్నారా - ఇలాంటోళ్లు కూడా ఉంటారు, జర పైలం