హైదరాబాద్‌లో మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ఎస్‌ఆర్‌డీపీ కింద నల్గొండ క్రాస్‌రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్‌మీదుగా ఓవైసీ జంక్షన్ వరకు 523 కోట్ల 37 లక్షల వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. దీనికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.
రూ.523 కోట్లతో కారిడార్... శంకుస్థాపన చేసిన కేటీఆర్ - కారిడార్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన
ఎస్‌ఆర్‌డీపీ కింద మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. నల్గొండ క్రాస్‌రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు రూ.523 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఈ కారిడార్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
రూ.523 కోట్లతో కారిడార్... శంకుస్థాపన చేసిన కేటీఆర్
ఈ కారిడార్ పొడవు 3.382 కిలోమీటర్లు కాగా... ఫ్లైఓవర్ పొడవు 2.58 కిలోమీటర్లు. రెండు వైపులా ర్యాంప్ ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. ఇరువైపులా రాకపోకలు సాగించే విధంగా నాలుగు లైన్లతో ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నట్లు వివరించారు. 24 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఈ నిర్మాణంతో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు.