మరఠ్వాడా నుంచి కర్ణాటక, తెలంగాణల మీదుగా తమిళనాడు వరకూ... గాలులతో ఉపరితల ఆవర్తనం 900 మీటర్ల ఎత్తున కొసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.
రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు - వర్ష సూచన
రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.
![రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు chance-of-raining-for-four-days-in-the-state-from-today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11538464-thumbnail-3x2-weather.jpg)
రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలుల వీచే అవకాశాలున్నాయంది. ఆదివారం అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి. మద్గుల్ చిట్టెంపల్లి (వికారాబాద్ జిల్లా)లో 14, పూడూరు (జగిత్యాల)లో 9.3, రుద్రంగి (సిరిసిల్ల)లో 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు కొనసాగే అవకాశాలున్నందున ధాన్యాన్ని బయట ఆరబోయవద్దని రైతులకు మార్కెటింగ్ శాఖ సూచించింది.
ఇదీ చూడండి:చేతికొచ్చిన పంట నీటిపాలు... అకాల వర్షంతో రైతన్న గగ్గోలు