రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center)ప్రకటించింది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. నిన్న 15 ఎన్ అక్షాంశం వెంబడి ఉన్న తూర్పు- పశ్చిమ షియర్ జోన్ ఈరోజు బలహీన పడినట్లు పేర్కొంది.
Ts Rains: రెయిన్ అలెర్ట్... రాగల మూడురోజులపాటు వర్షాలు - Rains in telangana
తెలంగాణలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
It rained for three days
రుతపవనాల ద్రోణి ఈరోజు పోరుబందర్, సూరత్, జల్గాన్, రామగుండం, మచిలీపట్నం మీదగా తూర్పు ఆగ్నేయ దిశగా మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఉపరితల ద్రోణి దక్షిణ గుజరాత్ నుంచి దక్షిణ కోస్తా ఆంద్రా తీరం వరకు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతుందని తెలిపింది.
ఇదీ చూడండి:భారత్లో 'దక్షిణాఫ్రికా' కరోనా వేరియంట్- నిజమెంత?
Last Updated : Sep 1, 2021, 2:03 PM IST