తెలంగాణ

telangana

ETV Bharat / state

WEATHER REPORT: రాగల మూడ్రోజులు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - హైదరాబాద్ వాతావరణ కేంద్రం

రాగల మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

chance-of-light-rain-in-next-three-days-in-telangana
రాగల మూడ్రోజులు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

By

Published : Aug 21, 2021, 1:37 PM IST

రాగల మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి వెల్లడించింది. రాజస్థాన్‌ నుంచి తెలంగాణ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి వస్తుందని... ఆ ప్రభావం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గత 20 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులుఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణం చల్లబడి వర్షాలు కురవడంతో పంటలకు కొంత మేలు జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి:AP RAINS: ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు.. రహదారులు జలమయం

ABOUT THE AUTHOR

...view details