ఆర్టీసీ ఐకాస తలపెట్టిన ఛలో ట్యాంక్‌బండ్ ఉద్రిక్తతంగా మారింది. తెలుగు తల్లి ప్లైఓవర్ వైపు నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ట్యాంక్‌బండ్ వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులు ఎక్కువ సంఖ్యలో రావటం వల్ల పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. కొంతమంది మహిళా కార్మికులను బలవంతంగా అరెస్టు చేశారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
రణరంగమైన ట్యాంక్‌బండ్ పరిసరాలు - TSRTC STRIKE LATEST NEWS IN TELUGU
హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ ప్రాంతమంతా... టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం... అరెస్టులు, లాఠీఛార్జీలు, భాష్పవాయువు ప్రయోగాలతో ఉద్రిక్తంగా మారింది. ఆందోళనాకారులను ఎక్కడికక్కడ చెదరగొట్టి ట్యాంక్‌బండ్ పరిసరాలను బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.

CHALO TANK BUND BECAME AGGRESSIVE WITH POLICE LAATI CHARGE IN HYDERABAD
లాఠీఛార్జీతో ఉద్రిక్తంగా మారిన 'ఛలో ట్యాంక్‌బండ్'