తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ అమరుడు పొట్టిగారి రమేశ్ గంగపుత్రకు చైతన్య సమితి నివాళి - పొట్టిగారి రమేశ్ గంగపుత్ర 9వ వర్థంతి

తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ అమరుడైన కామారెడ్డి జిల్లా వాసి పొట్టిగారి రమేశ్ 9వ వర్థంతిని నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రావాలంటూ కామారెడ్డి రైల్వే స్టేషన్​లో ఎక్స్​ప్రెస్ రైలును ఢీకొని ఆత్మబలిదానం చేశారని తెలంగాణ గంగపుత్ర చైతన్య సమితి కీర్తించింది.

తెలంగాణ అమరుడు పొట్టిగారి రమేశ్ గంగపుత్రకు చైతన్య సమితి నివాళి
తెలంగాణ అమరుడు పొట్టిగారి రమేశ్ గంగపుత్రకు చైతన్య సమితి నివాళి

By

Published : Aug 18, 2020, 9:01 AM IST

Updated : Aug 20, 2020, 12:58 AM IST

తెలంగాణ మలి దశ పోరాట యోధుడు పొట్టిగారి రమేశ్ గంగపుత్ర 9వ వర్థంతి కార్యక్రమాన్ని గంగపుత్ర చైతన్య సమితి నిర్వహించింది. అంబర్ పేట రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రమేశ్​కు నివాళులు అర్పించారు. తెలంగాణ అమరుడు రమేశ్ కాంస్య విగ్రహాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఆయన పేరుతో నామకరణం చేయాలని సంఘ నేతలు తీర్మానించారు.

త్వరలో వినతి పత్రాలు...

త్వరలోనే ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ సహా కామారెడ్డి ఎమ్మెల్యేకు ఈ మేరకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చైతన్య సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ బెస్త తెలిపారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, రామారెడ్డి గ్రామానికి చెందిన రమేశ్ తెలంగాణ రాష్ట్ర సాధానే లక్ష్యంగా రైలును ఢీకొని ప్రాణాత్యాగం చేశారని సమితి సలహాదారుడు పూస ఋనర్సయ్య బెస్త గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ అమరుడు పొట్టిగారి రమేశ్ గంగపుత్రకు చైతన్య సమితి నివాళి

ఇవీ చూడండి : 'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు'

Last Updated : Aug 20, 2020, 12:58 AM IST

ABOUT THE AUTHOR

...view details