తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపిన వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ - waqf board chairman telangana

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం ఆమోదించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మహమ్మద్ సలీమ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏ ముఖ్యమంత్రి కూడా వక్ఫ్ ఆస్తుల గురించి ఆలోచించలేదని అన్నారు.

Chairman of the Waqf Board thanked to cm KCR
కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపిన వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్

By

Published : Sep 12, 2020, 4:31 PM IST

కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మహమ్మద్ సలీమ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే ఏకైక సెక్యులర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.

గంగా జమునా తహజీబ్ మన రాష్ట్రమన్నారు. వక్ఫ్ ఆస్తులను రక్షించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా వక్ఫ్ ఆస్తుల గురించి ఆలోచించలేదని పేర్కొన్నారు.

రెవెన్యూ కొత్త చట్టంలో వక్ఫ్ ఆస్తులకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. వక్ఫ్ భూములు ఎంతో మంది కబ్జా చేశారని అందరికి నోటీసులు ఇచ్చి.. వక్ఫ్ బోర్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారివి రద్దు చేస్తామని వెల్లడించారు. యావత్ ముస్లిం సమాజం తరపున సీఎం కేసీఆర్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి :అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలో ఉల్లంఘనలు

ABOUT THE AUTHOR

...view details