తెలంగాణ

telangana

ETV Bharat / state

500 మందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన ట్రస్టు ఛైర్మన్​ - ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ తాజా వార్తలు

అబిడ్స్​లో పారిశుద్ధ్య కార్మికులకు, నీరు పేదలకు ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. సుమారు 500 మందికి ఆ ట్రస్ట్ అధ్యక్షుడు నంద కిషోర్ బిలాల్ సరకులను అందజేశారు.

Chairman of the aditya Trust, distributes essentials to 500 people at abids
500 మందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన ట్రస్టు ఛైర్మన్​

By

Published : Apr 25, 2020, 3:11 PM IST

అబిడ్స్​లోని మురళీధర్ బాగ్ ప్రాంతాల్లో 500 మంది నిరుపేదలకు ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నంద కిషోర్ బిలాల్ నిత్యావసరాలు వితరణ చేశారు. 25 వేల మందికి సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.

లాక్​డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలు అనవసరంగా బయటికి రావొద్దని కోరారు. ఏదైనా సాయం కావాలంటే తమ ట్రస్ట్​ను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి సరుకులు అందిస్తామని బిలాల్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :మనవరాలితో కలిసి టేబుల్​ టెన్నిస్​ ఆడిన మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details