తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో తొలిసారిగా నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు.. ఎప్పటినుంచంటే..! - హైదరాబాద్ తాజా వార్తలు

TSRTC upadats Today: ప్రైవేట్‌ బస్సులకు ధీటుగా అత్యాధునిక హంగులతో రూపొందించిన స్లీపర్ బస్సులను ఆర్టీసీ నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్‌-కాకినాడ, హైదరాబాద్‌-విజయవాడ మార్గాల్లో అద్దె ప్రతిపాదికన ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడపనుంది. హైదరాబాద్‌ కేపీహెచ్బీ కాలనీ బస్​స్టాప్ దగ్గర ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ సజ్జనార్‌ ఈ కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు

TSRTC upadats Today
TSRTC upadats Today

By

Published : Jan 4, 2023, 6:54 AM IST

Updated : Jan 4, 2023, 7:07 AM IST

రాష్ట్రంలో తొలిసారిగా నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు.. ఎప్పటినుంచంటే..!

RTC is Making Available Non AC Sleeper Buses: ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్రంలో తొలిసారిగా నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటగా 4 స్లీపర్‌, మరో 6 స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులను ఇవాళ ప్రారంభించనుంది. హైదరాబాద్‌-కాకినాడ, హైదరాబాద్‌-విజయవాడ మార్గాల్లో అద్దె ప్రతిపాదికన ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడపనుంది. హైదరాబాద్‌ కేపీహెచ్బీ కాలనీ బస్​స్టాప్ వద్ద సాయంత్రం 4 గంటలకు సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ సజ్జనార్‌ ఈ బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ బెర్తులు 15, అప్పర్‌ బెర్తులు 15 వరకు ఉంటాయి. ప్రతి బెర్త్‌ వద్ద వాటర్‌ బాటిల్‌ పెట్టుకునే సదుపాయంతోపాటు మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యం ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సులోనూ వైఫై సదుపాయం కల్పించారు. ఈ బస్సుల్లో ప్రయాణించేవారికి ఒక వాటర్‌ బాటిల్‌తో పాటు ఫ్రెష్‌నర్‌ను ఉచితంగా అందజేస్తారు. లగేజీ లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు అటెండెంట్లు సహకరిస్తారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
ఇవీ చదవండి:

Last Updated : Jan 4, 2023, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details