తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లు అద్దెకు కావాలని వస్తారు... కాజేస్తారు - చైన్​స్నాచర్స్​ అరెస్ట్​

అద్దెకు ఇల్లు కావాలని వెళ్లారు.. చుట్టూ పరిసరాలను గమనించారు. ఒంటరిగా ఓ వృద్ధురాలు కనిపించింది. అంతే పక్కా ప్లాన్​ ప్రకారం పుస్తలెతాడు కాజేశారు. హమయ్య కొన్నిరోజులు జల్సా చేయొచ్చని భావించారు.. కానీ సీన్​ రివర్స్​ అయ్యి.. కటకటాల పాలయ్యారు.

Chain Snatcher Arrest in Hyderabad
జల్సాలకు అలవాటుపడిన దొంగ జంట

By

Published : Jan 23, 2020, 12:58 PM IST

దొంగతనం చేసిన బంగారు గొలుసు అమ్ముతూ హైదరాబాద్​ తిరుమలగిరి పోలీసులకు వడ్లూరి విజయలక్ష్మి, సాయికిరణ్​ దంపతులు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి ఐదుతులాల పుస్తెలతాడు.. ఒక ద్విచక్రవాహనం, రెండు చరవాణీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం

సికింద్రాబాద్​ పరిధిలోని టీచర్స్​కాలనీలో వడ్లూరి సాయికిరణ్​ దంపతులు కిరాయికి ఉంటున్నారు. ఈనెల 14వ తేదీన అదే కాలనీలో ఉంటున్న భ్రమరాంబ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి రూమ్​ అద్దెకు ఉందా అని విజయలక్ష్మి అడిగింది. ఇక్కడేమీ కిరాయికి లేవని ఆమె సమాధానమిచ్చింది. కొద్దిసేపటికి పక్కా ప్లాన్​ ప్రకారం భ్రమరాంభ ఇంటి తలుపు తట్టి ఆమె తలుపుతీయగానే మెడలోని పుస్తెలతాడును బలవంతంగా లాక్కుని బైక్​పై వీరు పారిపోయారు. దీనితో ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.

అయితే 22వ తేదీ చిలకలగూడ సమీపంలోని ఓ దుకాణంలో ఆ జంట గొలుసును అమ్ముతుండగా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసినందుకు బేగంపేట ఏసీపీ శ్రీ నరేశ్​రెడ్డి క్రైమ్​ సిబ్బందిని అభినందించారు.

జల్సాలకు అలవాటుపడిన దొంగ జంట

ఇవీ చూడండి: మెరుపు వేగంతో కరోనా పంజా.. వుహాన్​ రాకపోకలపై ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details