తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎవరితో చర్చించకుండా చట్టాలు చేస్తే ఇలానే ఉంటుంది' - municipal act

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఎలాంటి కసరత్తు చేయకుండానే మున్సిపల్ చట్టాన్ని రూపొందించారని విమర్శించారు.

'ఎవరితో చర్చించకుండా చట్టాలు చేస్తే ఇలానే ఉంటుంది'

By

Published : Jul 24, 2019, 11:54 PM IST

మున్సిపల్​ చట్టం విషయంలో ఎవరితో చర్చించకుండా రూపొందించినందుకు కోర్టు సరైన సమాధానం చెప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి చట్టాన్ని తెచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ నెల 25న డా.రాజ్‌ బహద్దూర్‌ గౌర్‌ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందన్నారు. సీపీఐ కార్యాలయంలో స్మారక హాలును సురవరం సుధాకర రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.

'ఎవరితో చర్చించకుండా చట్టాలు చేస్తే ఇలానే ఉంటుంది'
ఇదీ చూడండి: హామీలు నేరవేర్చకపోతే ఆందోళన : చాడ

ABOUT THE AUTHOR

...view details