తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాజెక్టులను సందర్శించనున్న సీపీఐ బృందం - cpi

తెలంగాణలో పరిపాలన గాడి తప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనను తిరస్కరిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలకు సన్నద్ధం కావాలని సీపీఐ నిర్ణయించినట్లు చాడ వెల్లడించారు.

నీటి ప్రాజెక్టులను సందర్శించనున్న సీపీఐ బృందం

By

Published : Jun 9, 2019, 5:37 PM IST

హైదరాబాద్‌ మఖ్ధూం భవన్‌లో శనివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశ తీర్మానాలను వెంకట్‌రెడ్డి వివరించారు. పోడు భూములు, భూప్రక్షానలో చోటుచేసుకుంటున్న లోపాలపై స్థానికులతో ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో సీపీఐ ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపడతామన్నారు. ప్రధానంగా ప్రాణహిత, తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలన కోసం ప్రభుత్వ అనుమతి కోరినట్లు వివరించారు.

నీటి ప్రాజెక్టులను సందర్శించనున్న సీపీఐ బృందం

ABOUT THE AUTHOR

...view details