ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములు కాపాడటంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యను, పరిపాలన విభాగాన్ని చంపేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా వర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే గవర్నర్‌ను కలుస్తామని చాడ తెలిపారు. వర్సిటీలకు పాలకమండళ్లు లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తక్షణమే ఉపకులపతిని నియమించి భూములను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
"యూనివర్సిటీకి వీసీని నియమించకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయ్- కోదండరాం