కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో పేద ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తెజస అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి: చాడ వెంకట్ రెడ్డి - కోదండరాం అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష
లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెజస అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
![భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి: చాడ వెంకట్ రెడ్డి chada venkat reddy speak in all party meeting at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7100828-thumbnail-3x2-chada.jpg)
భవన నిర్మాణ కార్మికులకు ఆదుకోవాలి: చాడ వెంకట్ రెడ్డి
ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులకు ఈనెల 11వ తేదీలోగా రూ.10 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని చాడ డిమాండ్ చేశారు. చెల్లించకపోతే ఈనెల 12న కార్మికశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. ప్రతిపక్షాలపై ఉన్న మొండి వైఖరిని ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చుకోవాలన్నారు.
ఇదీ చూడండి:విశాఖ 'గ్యాస్‌లీక్' ఘటనపై టాలీవుడ్ విచారం