హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17నే... తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. తెరాస అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తానని... కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పడం అన్యాయమన్నారు.
అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ మాట తప్పారు: చాడ - తెలంగాణ విమోచన దినోత్సవం వార్తలు
తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్.. మాట తప్పారని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని మగ్ధుమ్ భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ మాట తప్పారు: చాడ
తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధుమ్భవన్లో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. పాలకులు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే.. కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు.
ఇదీ చూడండి:'విమోచనాన్ని అధికారికంగా నిర్వహించే వరకు పోరాటం ఆగదు'