రాష్ట్రానికి ఐటీఐఆర్ ఇవ్వడంలో కేంద్రం అనాసక్తిని ప్రదర్శిస్తుండటం అన్యాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాలు పంచుకుంటోందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలను ఆయన తీవ్రంగా ఖండించారు.
'బండి.. ఐటీఐఆర్‌ను తీసుకురావడంలో విఫలమయ్యారు' - చాడ వెంకట్ రెడ్డి
ఐటీఐఆర్ ప్రాజెక్టును తీసుకురావడంలో బండి సంజయ్ విఫలం చెందారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర భాజపా నేతలు.. కేంద్రంతో చర్చించి, ప్రాజెక్టును మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
'బండి.. ఐటీఐఆర్‌ను తీసుకురావడంలో విఫలమయ్యారు'
సర్కారియా కమిషన్ ఇచ్చిన ఫెడరల్ వ్యవస్థకు భిన్నంగా.. కేంద్రం, రాష్ట్రాల హక్కులను హరిస్తోందని చాడ విమర్శించారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని.. కొనుగోలు చేయకపోవటం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తిరగబడితే కేంద్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని హెచ్చరించారు.