ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని వీటన్నిటికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. మొత్తం 26 మంది విద్యార్థుల బలిదానాలన్నీ ప్రభుత్వ హత్యలేనని అఖిలపక్షం సమావేశంలో తెలిపారు. కోర్టు ఆదేశాలివ్వగానే మల్లన్నసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్న కేసీఆర్ విద్యార్థుల ఆత్మహత్యలను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు చెప్తే తప్ప ముఖ్యమంత్రి పనిచేయరంటూ చాడ ఎద్దేవా చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మే 11న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబోయే నిరసన దీక్షలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనాలని సూచించారు.
'కోర్టు ఆదేశాలిస్తే తప్ప కేసీఆర్ పనిచేయరు' - KCR
డేటాటెక్ మెధడెక్స్ సంస్థకు ఫలితాల బాధ్యత అప్పగించినప్పటికీ... గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవట్లేదు. విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు: చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
'కోర్టు ఆదేశాలిస్తే తప్ప కేసీఆర్ పనిచేయరు'