దిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ సమావేశానికి వెళ్లిన వారు వైద్య పరీక్షలు చేయించుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మత పెద్దల సహాయం తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సూచించారు.
తక్షణమే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి: చాడ - తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి కరోనాపై పోరాటంలో అందరినీ భాగస్వామ్యులను చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కోరారు. ఒక మతం వారి వల్లే దేశంలో కరోనా ప్రబలినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు.
Chada Venkat Reddy respond about carona virus issue
గత నెల 13న ప్రధాని మన దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగలేదని చెప్పారన్నారు. కరోనా తీవ్రతను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని పేర్కొన్నారు. మన దేశంలో కరోనా సోకిన విదేశీయులు, విదేశాల నుంచి కరోనా బారిన పడి వచ్చిన స్వదేశీయులను గుర్తించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లిన వారిపై తప్పంతా వేయడం సబబుకాదన్నారు.