రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం శుభ పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.
ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయండి: చాడ - ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని చాడ డిమాండ్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం శుభ పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని చాడ డిమాండ్ చేశారు.
ఉద్యోగాల ఖాళీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: చాడ
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని.. గతంలో సీఎం ఈ అంశంపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్న చాడ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం