తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర జీఎస్టీ అధికారుల అవగాహన సదస్సులు - జీఎస్టీ రిటర్న్​లు

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 7 వరకు అన్ని జిల్లాల్లో కేంద్ర జీఎస్టీ అధికారుల అవగాహన సదస్సులు జరగనున్నాయి. జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయడంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.

CGST Awareness seminars At telanagana state wide
రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర జీఎస్టీ అధికారుల అవగాహన సదస్సులు

By

Published : Feb 26, 2020, 10:20 AM IST

కొత్తగా మారిన విధానంలో జీఎస్టీ రిటర్న్​లు దాఖలు చేయడంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఎదురవుతున్న ఇబ్బందులు, సాంకేతిపరంగా వస్తోన్న అనుమానాలు వంటి అంశాలపై కేంద్ర జీఎస్టీ అధికారుల అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఇది వచ్చే నెల 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.

కేంద్ర జీఎస్టీ చీఫ్​ కమిషనర్​ వాసా శేషగిరిరావు నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమాల్లో వివిధ వర్గాలకు చెందిన వ్యాపారస్తులు, వాణిజ్య, పారిశ్రామిక రంగ ప్రతినిధులు, కన్సల్టెంట్లు, ఆడిటర్లు పాల్గొనేట్లు ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

జీఎస్టీకి చెంది కొత్త రిటర్న్​ విధానం ఏలా ఉంటుంది.. వెబ్​సైట్​లో ఏలా అప్​లోడ్ చేయాలనే అంశాలపై వివరిస్తారని కేంద్ర జీఎస్టీ అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర జీఎస్టీ అధికారుల అవగాహన సదస్సులు

ఇదీ చూడండి:కేసీఆర్​ ఆతిథ్యానికి ట్రంప్​ ఫిదా​

ABOUT THE AUTHOR

...view details