తెలంగాణ

telangana

ETV Bharat / state

bharat biotech: భారత్‌ బయోటెక్‌ కన్సార్షియంకు సీఈపీఐ నిధులు - హైదరాబాద్ తాజా వార్తలు

bharat biotech: భారత్‌ బయోటెక్‌ కన్సార్షియంకు కొయలిషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్‌ నిధులు సమకూర్చనుంది. కరోనా సమర్థంగా పనిచేసే టీకా తయారీకి వీటిని ఉపయోగించనుంది.

భారత్‌ బయోటెక్‌
భారత్‌ బయోటెక్‌

By

Published : May 10, 2022, 9:06 PM IST

bharat biotech: అన్ని రకాల కొవిడ్ వేరియంట్‌లపై సమర్థంగా పనిచేసే టీకా తయారీకి భారత్‌ బయోటెక్‌తో కూడిన కన్సార్షియంకు సీఈపీఐ సంస్థ నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చిందని భారత్ బయోటెక్ ప్రకటించింది. తద్వారా భారత్‌ బయోటెక్‌ కన్సార్షియంకు 19.3 మిలియన్‌ డాలర్ల నిధులను సమకూర్చనుంది.

ఈ మొత్తంతో వేరియెంట్ ఫ్రూఫ్ సార్స్‌ కొవిడ్-2 టీకా తయారీతో పాటు క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహిస్తామని వెల్లడించింది. సీఈపీఐ నిధుల కేటాయింపుపై భారత్ బయోటెక్ హర్షం వ్యక్తం చేసింది. కరోనాను ఎదుర్కొనే టీకా తయారీ కోసం యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, ఆస్ట్రేలియా, ఎక్సెల్ జీన్-ఎస్​ఏ సంస్థలతో కలిసి... భారత్ బయోటెక్ గతంలోనే కన్సార్షియంను ఏర్పాటు చేసింది.

ABOUT THE AUTHOR

...view details