Shashank goyal News: రాజకీయ పార్టీలతో సీఈవో భేటీ.. ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన
12:29 November 01
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో శశాంక్ గోయల్ భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో 3,03,56,665 మంది ఓటర్లున్నారు. 2022 జనవరి ఒకటి అర్హత తేదీతో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదాను సోమవారం ప్రకటించారు. దీని ప్రకారం పురుష ఓటర్లు 1,52,57,690 మంది కాగా... మహిళల సంఖ్య 1,50,97,292... ఇతరులు 1,683 మంది ఉన్నారు. అందులో సర్వీసు ఓటర్లు 14,501 మంది కాగా... ఎన్ఆర్ఐ ఓటర్ల సంఖ్య 2,742, దివ్యాంగుల సంఖ్య 5,01,836. ఈ ముసాయిదాపై నెలాఖరు వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరిస్తారు. హుజూరాబాద్‌లో మాత్రం ఈ నెల 6న ముసాయిదా ప్రకటించి... డిసెంబర్ 6 వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2022 జనవరి ఐదో తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటిస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్(Shashank goyal News) సోమవారం సమావేశమయ్యారు.
ముసాయిదా ప్రకారం
- రాష్ట్రంలో మొత్తం ఓటర్లు- 3,03,56,665 మంది
- పురుష ఓటర్లు- 1,52,57,690 మంది
- మహిళా ఓటర్లు- 1,50,97,292 మంది
- ఇతరులు 1,683 మంది
- సర్వీసు ఓటర్లు- 14,501 మంది
- ఎన్ఆర్ఐ ఓటర్లు- 2,742 మంది
- దివ్యాంగ ఓటర్లు- 5,01,836 మంది
ఓటరు జాబితా సరిగా లేదన్న కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి... ఇంటినంబర్ ద్వారా ఓటుహక్కు తెలుసుకునే సౌలభ్యాన్ని తీసివేశారని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సిబ్బందిని ఈసీ ఆధీనంలోకి ఇవ్వాలని కోరారు. హుజూరాబాద్‌లో వీవీప్యాట్‌ను ప్రైవేట్ వాహనంలో ఎందుకు తరలించారన్న ప్రశ్నకు సీఈవో వద్ద సమాధానం లేదని కాంగ్రెస్ నేత నిరంజన్ అన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపుపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలన్న తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి... సెల్ఫోన్లకు సందేశాలు పంపాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు విషయంలో సమతుల్యత పాటించాలని కోరారు. పెరిగిన ఓటర్లకు అనుగుణంగా నియోజవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న భాజపా నేత మల్లారెడ్డి... ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ బూత్‌లు ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:tragedy: పసివయసులో పుట్టెడు దు:ఖం.. 'నాన్నా... నువ్వూ వెళ్లిపోయావా!'