తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి' - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​

కుటుంబ సభ్యులందరికీ ఒకే చోట ఓటు ఉండేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​ కుమార్​ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల పరిశీలనా కార్యక్రమం, జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.

సీఈవో రజత్​కుమార్​

By

Published : Sep 9, 2019, 8:15 PM IST

ఓటర్ల పరిశీలనా కార్యక్రమం, జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సూచించారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు తగిన సహకారం అందించాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వెబ్​సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ వివరాలను పరిశీలించుకుని... అవసరమైతే మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని వివరించారు. గతంలో కుటుంబంలోని వారి ఓట్లు వేర్వేరు చోట్ల ఉండేవని... ఇక నుంచి ఆ ఇబ్బంది లేకుండా ఒకే చోట ఉండేలా వెసులుబాటు ఉంటుందని అన్నారు. జిల్లా స్థాయిల్లోనూ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. పురపాలక ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు.

'జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details