తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష టన్నుల కొనుగోలుకు కేంద్రం అనుమతి: మంత్రి నిరంజన్‌రెడ్డి - కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్

రాష్ట్రంలో లక్ష టన్నుల కందుల కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ముందు చూపుతో కేంద్రానికి లేఖ రాసి అనుమతి వచ్చేలా చేసిన సీఎం కేసీఆర్​కు రైతుల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Center permits for purchase of cuttings
కందుల కొనుగోలుకు కేంద్రం అనుమతి

By

Published : Mar 4, 2020, 12:05 PM IST

రాష్ట్రంలో మరో లక్ష టన్నుల కందుల కొనుగోలుకు కేంద్రం మంగళవారం అనుమతి ఇచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 51 వేల టన్నులను కేంద్రం కొనుగోలు చేసింది. సీఎం కేసీఆర్‌ విన్నపం మేరకు అదనంగా మరో లక్ష టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని మంత్రి వెల్లడించారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణలో పండిన పంటనంతా కొంటామని వివరించారు.

ఇవీ చూడండి: 'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'

ABOUT THE AUTHOR

...view details