తెలంగాణ

telangana

ETV Bharat / state

షీ టీమ్​కు ఆరేళ్లు.. మహిళా రక్షణలో ఆశించిన స్థాయికి చేరిందా.? - cess study on she team

ఆధునికత, సాంకేతికత వైపు ప్రపంచం అడుగులు వేస్తున్నా మహిళలు, యువతుల్లో మాత్రం కొన్ని అపోహలు, భయాలు తొలగడం లేదు. వారి భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర పోలీసు శాఖ ఎన్నో చర్యలు చేపట్టింది. అందులో వినూత్న ప్రయోగమే షీ టీమ్స్​. ఆపదలో ఉన్న మహిళలను రక్షించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా.. కొందరు బాధితులు మున్ముందు ఈ కేసుల్లో ఇరుక్కోవడం ఎందుకని భయపడుతున్నారు. మరికొందరు షీ బృందాల సేవలపై సంతృప్తికరంగా లేమని చెబుతున్నారు. అసలు కారణాలు ఏంటనే దానిపై సెస్​ ఓ అధ్యయనం చేసింది.

survey on she teams
షీ బృందాలపై సర్వే

By

Published : Apr 11, 2021, 5:14 PM IST

Updated : Apr 11, 2021, 5:26 PM IST

మహిళా భద్రత కోసం రాష్ట్ర పోలీసులు ప్రారంభించిన షీటీమ్స్​కు వేధింపులు ఎదుర్కొంటున్న వారిలో మూడొంతుల మంది మందుకు రావడం లేదని తాజాగా సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్​) చేసిన అధ్యయనంలో వెల్లడైంది. వేధింపులపై ఫిర్యాదు చేసి వాటి వల్ల సమస్యలు ఎదుర్కోవడం ఎందుకని కొందరు.. ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణాలని తేలింది.

ఆరేళ్లు దాటినా..

2014 అక్టోబరు 24న మొదటగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రారంభమైన షీ బృందాలు.. తర్వాత సైబరాబాద్​కు విస్తరించాయి. 2015 ఏప్రిల్ 1న రాష్ట్రమంతటా వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహిళలపై వేధింపులను నియంత్రించడమే కాకుండా దారి తప్పిన యువతను కౌన్సెలింగ్ ద్వారా సరిచేయడం ఈ బృందాల లక్ష్యం. ఈ బృందాల సేవలు ఆరేళ్లు దాటిన నేపథ్యంలో వీటి గురించి ఎంత మందికి అవగాహన ఉంది. వీటి సేవలపై బాధితురాళ్ల స్పందన ఏంటి.? అనే అంశాలపై సెస్​ అధ్యయనం చేసింది.

314 మందికి సర్వే..

హైదరాబాద్ కమిషనరేట్‌లోని బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా టీజింగ్, అసభ్యకర కామెంట్లు, దుష్ప్రవర్తన ఘటనలు నమోదవుతుండగా.. సైబరాబాద్, రాచకొండల్లో మాత్రం ఫోన్లలో వేధింపులు ఎక్కువగా వెలుగుచూస్తున్నట్లు తేలింది. 25-35 ఏళ్ల వయసున్న 314 మంది బాధితురాళ్ల నుంచి స్పందన రాబట్టింది. వీరిలో 18 మంది అంటే.. 6.05 శాతం మంది షీ బృందాల పనితీరుతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. వీరిలో రెండింట మూడొంతులు హైదరాబాద్​కు చెందినవారు కావడం గమనార్హం. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు చాలా సేపు నిరీక్షించామని 16 శాతం మంది ఆరోపించారు. మహిళా సిబ్బంది అందుబాటులో లేరని చెప్పారు. ఈ 314 ఫిర్యాదుల్లో 271మందికి పరిష్కారం లభించింది.

పనితీరుపై అభిప్రాయాలు..

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా 92 శాతం కేసులు పరిష్కారం కాగా.. హైదరాబాద్​లో 88 శాతం, రాచకొండలో 75 శాతం పరిష్కారమయ్యాయి. దాదాపు 68 శాతం కేసుల్లో నిందితుల్ని కేవలం హెచ్చరికలతోనే వదిలేస్తున్నట్లు తేలింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మాత్రమే మూడొంతుల ఫిర్యాదులను ఎఫ్ఐఆర్‌గా నమోదు చేశారు. 314 మంది బాధితురాళ్లలో 3 శాతం మంది షీ బృందాల పనితీరు చాలా బాగుందని చెప్పగా.. 47 శాతం మంది బాగుంది అని, 10 శాతం మంది సంతృప్తికరమని అన్నారు. 4 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 89 నుంచి 90 శాతం మంది షీ బృందాల పనితీరు గురించి తెలుసని వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇది 86 శాతంగా నమోదైంది. ఫిర్యాదు నుంచి మొదలుకొని సమస్య పరిష్కారం వరకు ఎక్కడా సమస్య ఎదురు కాలేదని 288 మంది వెల్లడించారు. ఈ సర్వేలో విద్యార్ధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు, వృత్తి నిపుణులు, నిరుద్యోగ యువతులు, కార్మికులు, పలువురు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఇంజినీరింగ్‌ విద్యార్థిని ప్రతిభ.. తక్కువ ఖర్చుతోనే వినూత్న గృహం

Last Updated : Apr 11, 2021, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details