కేంద్ర బడ్జెట్ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. అయినా ప్రతిపక్ష నేతలెవరూ స్పందించట్లేదని మండిపడ్డారు. అసెంబ్లీ, సచివాలయం భవిషత్య్ అవసరాలకు అనుగుణంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణలో భాజపాతో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సహకారం వల్లే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాల్లో భాజపా గెలిచిందన్నారు.
'బడ్జెట్లో అన్యాయం జరిగినా ప్రతిపక్షాలు స్పందించట్లేదు' - injustice to telangana
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని తెరాస నేత, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కేంద్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేస్తోన్న భాజపా నేతలు : బాల్క సుమన్