కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (home minister Amit Shaw) అధ్యక్షతన తిరుపతి వేదికగా జరిగిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో (Southern Zonal Council Meeting) రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రతిపాదించిన ఎజెండాలో తెలంగాణకు సంబంధం ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించింది. పాలమూరు-రంగారెడ్డి, (Palamuru-Rangareddy) నక్కలగండి ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి ఏపీలోనే ప్రారంభించిన ప్రాజెక్టులని... దిగువ రాష్ట్రాల హక్కులతో చేపట్టిన వీటిపై కర్ణాటకకు అభ్యంతరాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలవివాదాలను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ (Brijesh Kumar Tribunal) చూస్తున్నందున రెండు ప్రాజెక్టుల విషయంలో ట్రైబ్యునల్ తీర్పునకు కట్టుబడి ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పాలమూరు - రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టుల డీపీఆర్లు కేంద్ర జలసంఘం ఆమోదం కోసం జనవరి 15లోగా కేఆర్ఎంబీకి (krmb) ఇవ్వాలని కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. సంగంబండ విషయంలో కర్ణాటకకు లేఖ రాశామన్న తెలంగాణ... సంయుక్త సర్వే చేపట్టి ముంపు సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపింది.
సెటిల్మెంట్కు సిద్ధంగా ఉన్నాం..
విద్యుత్ సరఫరా చేసినందుకు తెలంగాణ డిస్కంలు ఏపీకి 3,442 కోట్లు ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందామన్న విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఏపీ... ఎన్సీఎల్టీ, కోర్టులను ఆశ్రయించిందని పేర్కొంది. వాస్తవానికి లెక్కలన్నీ తీస్తే ఏపీ నుంచే తమకు విద్యుత్ బకాయిలు 4,457 కోట్లు రావాల్సి ఉందని... ఏపీతో పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ వివరించింది.
కేంద్ర ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం