తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు పహారా మధ్య ప్రశాంతంగా రెండోరోజు లాక్​డౌన్ - హైదరాబాద్ వార్తలు

ముషీరాబాద్ నియోజకవర్గంలోని వ్యాపారులు ఉదయం 10 గంటలకు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు. చిక్కడపల్లి డివిజన్​లోని పలు చెకింగ్ పాయింట్లను మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ సందర్శించారు.

Central Zone DCP Vishwaprasad, chikkadapalli division, hyderabad news
Central Zone DCP Vishwaprasad, chikkadapalli division, hyderabad news

By

Published : May 13, 2021, 2:44 PM IST

భారీ పోలీసు పహారా మధ్య లాక్​డౌన్ రెండోరోజు కొనసాగుతోంది. హైదరాబాద్ చిక్కడపల్లి డివిజన్​లోని ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్ చెకింగ్ పాయింట్లను మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ సందర్శించి పరిశీలించారు. నియమాలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. లాక్​డౌన్ రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోందని.. ప్రజలు నియమాలను పాటిస్తున్నారని తెలిపారు.

ఆర్టీసీ క్రాస్​రోడ్​లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్ వద్ద ట్రాఫిక్​కు ఎలాంటి అంతరాయం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశారని డీసీపీ తెలిపారు. లాక్​డౌన్ మొదటిరోజు మధ్య మండలం పరిధిలో నియమాలు ఉల్లంఘించిన 600 మందిపై కేసు నమోదు చేశామన్నారు.

ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్, ముషీరాబాద్ క్రాస్ రోడ్, రామ్ నగర్ క్రాస్ రోడ్, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం 10 గంటలకు మూసివేశారు.

ఇదీ చూడండి: టీకా పంపిణీపై లాక్‌డౌన్‌ ప్రభావం...కేంద్రాలకు తగ్గిన జనం

ABOUT THE AUTHOR

...view details