ప్రతిష్ఠాత్మక శాంతి స్వరూప్ భట్నాకర్ పురస్కారానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ సురజిత్ ధార ఎంపికయ్యారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అత్యుత్తమ భాగస్వామ్యం అందించిన వారికి .. సీఎస్ఐఆర్ వ్యవస్థాపక డైరెక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్ పేరిట ప్రతీ ఏటా పురస్కారం ఇస్తారు.
తెలుగుబిడ్డకు శాంతిస్వరూప్ భట్నాకర్ పురస్కారం - భట్నాకర్ పురస్కారానికి ఎంపికైన సురజిత్ ధార
ప్రతిష్ఠాత్మక శాంతి స్వరూప్ భట్నాకర్ పురస్కారానికి తెలుగు వ్యక్తి ఎంపిక అయ్యారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ సురజిత్ ధార ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.
తెలుగుబిడ్డకు శాంతిస్వరూప్ భట్నాకర్ పురస్కారం
సురజిత్ ధార భౌతిక శాస్త్రంలో ఐదేళ్లుగా చేసిన కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొని.. ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. సురజీత్ ధార గతంలోనూ పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
ఇదీ చూడండి :నిండుకుండలా మారిన దిగువ మానేరు జలాశయం