హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అమలు తీరును కేంద్ర బృందానికి నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వివరించారు. నియంత్రణ ప్రదేశాల్లో తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి సీపీ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ పనితీరును పరిశీలించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందం నగర పోలీసు కమిషనరేట్‌లో సమీక్షించింది.
కొవిడ్ కంట్రోల్ రూంను పరిశీలించిన కేంద్ర బృందం - హైదరాబాద్ సీపీతో భేటీ అయిన కేంద్ర బృందం
హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అమలుకు చేపడుతున్న చర్యల గురించి కేంద్ర బృందానికి సీపీ అంజనీకుమార్ వివరించారు. కొవిడ్ కంట్రోల్ రూంలో లాక్ డౌన్ అమలు తీరును కెమెరాల ద్వారా బృందం పరిశీలించింది. భౌతిక దూరం అమలుకు చేపడుతున్న చర్యల వివరాలను అడిగి తెలుసుకుంది.
hyderabad cp
కొవిడ్ కంట్రోల్ రూంలో లాక్‌డౌన్ అమలు తీరును సీసీ కెమెరాల ద్వారా కేంద్ర బృందం పరిశీలించింది. భౌతిక దూరం పాటించేలా పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి కేంద్ర బృందం ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని సీపీ వివరించారు.
ఇదీ చదవండి:'కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ తీసుకున్న చర్యలు భేష్'