రాష్ట్రంలో కరోనా కేసులపై అధ్యయనం కోసం కేంద్ర బృందం హైదరాబాద్‌కు వచ్చింది. ముగ్గురు సబ్యుల బృందం.. జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని సందర్శించింది. గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతిలతో బృంద సభ్యులు సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో జోన్లు, సర్కిళ్లు, వార్డులవారిగా నెలకొన్న పరిస్థితి గురించి వారు అడిగి తెలుసుకున్నారు. నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య, సంబంధిత కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్‌కు అనుసరిస్తున్న పద్దతి, లక్షణాలు కనిపించిన వ్యక్తులకు నిర్థరణ పరీక్షల నిర్వహించేందుకు సదుపాయాలు, ఆసుపత్రులు, హోం క్వారంటైన్, హోం ఐసోలేషన్, కంటైన్‌మెంట్ అంశాలపై చర్చించారు. నగరంలో కేసులు పెరగడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రేటర్లో కరోనా వ్యాప్తిపై కేంద్ర బృందం ఆందోళన
ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం జీహెచ్ఎంసీ కార్యాలయం సందర్శించింది. కరోనాపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతితో కేంద్ర బృందం సమీక్షించింది. కరోనా కేసుల సంఖ్య ఇదే విధంగా నమోదైతే... వచ్చే నెలాఖరికి పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని బృందం ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజల సహకారం చాలా కీలకమని కేంద్ర బృందం అభిప్రాయపడింది. దిల్లీ, ముంబాయి, చెన్నైలలో ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లలోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నందున... అక్కడ కేసుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 100 కేసులకంటే ఎక్కువగా నిర్థరణ అవుతున్నందున జీహెచ్ఎంసీ పరిధిలోనే 4 జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డిప్యూటి కమిషనర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ, సమన్వయాన్ని పెంచాలని సూచించారు.
ఇదీ చూడండి :ఒక టీచర్.. 25 పాఠశాలలు.. రూ.కోటి వేతనం