సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని కేంద్ర బృందం సందర్శించింది. వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఇతర విభాగాల వైద్యాధికారులతో బృంద సభ్యులు సమావేశమయ్యారు. కరోనా పాజిటివ్ కేసులకు అందిస్తున్న వైద్య సేవలు, వసతులు, అందుబాటులో ఉన్న శానిటేషన్, పారామెడికల్ సిబ్బంది వంటి వివరాలు తెలుసుకున్నారు. సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పీపీఈలు, మందుల లభ్యత లాంటి విషయాలపై ఆరా తీశారు. వైద్యశాలలోని బెడ్స్, ఐసీయూలో పడకలు, వెంటిలేటర్లు తదితర అంశాల గురించి వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న కేసులలో 90శాతం మంది ఆరోగ్యస్థితి మామూలుగానే ఉన్నట్లు వైద్యులు... కేంద్ర బృందానికి వివరించారు.
గాంధీ ఆసుప్రతిని సందర్శించిన కేంద్ర బృందం - కరోనా గాంధీ ఆసుపత్రి కేంద్ర బృందం
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌ను సందర్శించింది. అక్కడి వైద్యాధికారులతో మాట్లాడి కరోనా పాజిటివ్ కేసులకు అందుతున్న వైద్య సేవలు, వసతులు వంటి విషయాలను తెలుసుకున్నారు.
గాంధీ ఆసుప్రతిని సందర్శించిన కేంద్ర బృందం