డిసెంబర్ లోపు 200కోట్ల వ్యాక్సిన్లను దేశంలో ఉత్పత్తి చేయడంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సేవాహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరగగా.. ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఆశా వర్కర్లకు ఆయన తమ చేతుల మీదుగా సరుకులను పంపిణీ చేశారు. అంతకు ముందు డివిజన్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
Kishan reddy: 'డిసెంబర్ నాటికి దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్' - telangana varthalu
డిసెంబర్ నాటికి దేశంలోని ప్రజలందరికీ కేంద్రం వ్యాక్సిన్‌ను అందజేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందడం లేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
'డిసెంబర్ నాటికి దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్'
దేశంలోని ప్రజలందరికీ డిసెంబర్ నాటికి ఉచితంగా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అతి త్వరలో అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించి ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఎవరూ కూడా వ్యాక్సిన్ అందట్లేదని ఆందోళన చెందవద్దని... ప్రాధాన్యతా క్రమంలో అందరికి వ్యాక్సిన్‌ను అందస్తామన్నారు.
ఇదీ చదవండి:కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో తెరాస, ఈటల వర్గాల మధ్య రసాభాస