తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా ఒప్పుకుంటే వారితో కలిసి పోటీ చేస్తాం: రాందాస్ అథవాలే - ఎస్సీ డెవలప్​మెంట్ అధికారులతో కేంద్ర సహాయమంత్రి రాందాస్ అథవాలే సమావేశం

హైదరాబాద్​ బేగంపేటలో ఎస్సీ డెవలప్​మెంట్ అధికారులతో కేంద్ర సహాయమంత్రి రాందాస్ అథవాలే సమావేశమయ్యారు. సీఏఏ వల్ల భారత ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది రాదన్నారు. తెలంగాణలో జరిగే పుర ఎన్నికల్లో భాజపా సీట్లు కేటాయిస్తే.. తమ పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున కలిసి పోటీ చేస్తామని తెలిపారు.

Central_Minister_Ramdas_Review about caa and municipality elections
భాజపా ఒప్పుకుంటే వారితో పోటీ చేస్తాం: రాందాస్ అథవాలే

By

Published : Jan 6, 2020, 11:45 PM IST

జేఎన్​యూ జరిగిన ఘటనపై పోలీసులు విచారిస్తున్నారని... వీలైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేస్తారని సోషల్​ జస్టిస్ అండ్ ఎంపవర్​మెంట్​ సహాయమంత్రి రాందాస్ అథవాలే తెలిపారు.

సీఏఏ వల్ల భారత ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తబోదని హైదరాబాద్ బేగంపేటలో ఎస్సీ డెవలెప్​మెంట్​ అధికారులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రయోజనాల కోసమే సీఏఏపై రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. విద్యార్థులకు అవసరమైన ఉపకార వేతనాలు, బోధనా రుసుములు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

రాష్ట్రంలో జరిగే పురపాలిక ఎన్నికల్లో రిపబ్లిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా పోటీ చేస్తోందని ప్రకటించారు. ముందుగా భాజపాతో చర్చించి.. సీట్లు కేటాయిస్తే కలిసి పోటీ చేస్తామని... లేదంటే తమ అభ్యర్థులు బలంగా ఉన్న చోట పోటీ చేస్తారన్నారు.

భాజపా ఒప్పుకుంటే వారితో పోటీ చేస్తాం: రాందాస్ అథవాలే

ఇదీ చదవండిః 'మంత్రి రాలేదని... హరితహారం మొక్కల్ని వదిలేశారు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details