ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యానికి తెరాస ప్రభుత్వానిదే వైఫల్యమని... కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరించి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించేందుకు ఇప్పటికే అనేకసార్లు కాలపరిమితిని పొడిగించినా తెరాస సర్కార్ లక్ష్యాన్ని చేరుకోలేదని పేర్కొన్నారు. లోక్‌సభలో ఆహారభద్రత, పోషకాహారం లోపంపై చర్చ సందర్భంగా.. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యం కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ సభ దృష్టికి తెచ్చారు. అయితే చర్చతో సంబంధం లేదని అంశంపై ప్రశ్న అడిగారని స్పీకర్ మైక్‌ను కట్ చేశారు. అనంతరం కేంద్రమంత్రి గోయల్ సమాధానం ఇచ్చారు.
రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..
'బియ్యం సేకరణలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యాల కారణంగా తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వరిసాగు చేసిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సభలో నాటకం చేసిన తెరాస ఎంపీలు వాకౌట్ చేశారు. ఆగస్టులో భారత ఆహార సంస్థ 40లక్షల మెట్రిక్ టన్నుల సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అక్టోబర్ నుంచే మార్కెట్‌కు ధాన్యం రావడం మొదలైనా ఈరోజు వరకు కూడా సగం కూడా ఎఫ్‌సీఐ సేకరించలేదు.' -ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
తెరాస ప్రభుత్వ వైఫల్యమే..