ఆంధ్రప్రదేశ్‌లో రెండు కొత్త మార్గాలను హైవేలుగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్లు జారీచేసినట్లు చెప్పారు. ‘‘అమలాపురం(ఎన్‌హెచ్216) దగ్గరి నుంచి పలివెల మీదుగా రావులపాలెం వరకు (ఎన్‌హెచ్216ఎ) ఉన్న మార్గాన్ని, పెడన (ఎన్‌హెచ్216) నుంచి విస్సన్నపేట మీదుగా లక్ష్మీపురం (ఎన్‌హెచ్30)వరకు ఉన్న మార్గాన్ని జాతీయ రహదారులుగా ప్రకటిస్తూ ముసాయిదా నోటిఫికేషన్లు జారీచేశాం. అలాగే నాగ్‌పుర్-విజయవాడ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల నుంచి విజయవాడ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా సాగే గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌ను కూడా జాతీయ రహదారిగా ప్రకటిస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీచేశాం’’ అని ప్రకటించారు.
హైవేలుగా రెండు మార్గాలు... కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి - national high ways in andhrapradhesh
ఆంధ్రప్రదేశ్‌లో రెండు కొత్త మార్గాలను హైవేలుగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. నాగ్‌పుర్-విజయవాడ కారిడార్‌లో భాగంగా... మంచిర్యాల నుంచి విజయవాడ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా సాగే గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌ను కూడా జాతీయ రహదారిగా ప్రకటించారు.
హైవేలుగా రెండు మార్గాలు