Bjp Leaders Pays Tribute to Marri Chennareddy: మర్రి చెన్నారెడ్డి పరిపాలనా దక్షుడు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నేడు చెన్నారెడ్డి జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఇందిరాపార్కు సమీపంలోని చెన్నారెడ్డి రాక్ గార్డెన్‌లోని ఆయన సమాధి వద్ద కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అందించిన సేవలను కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఆయనతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మర్రి చెన్నారెడ్డి సమాధి వద్ద అంజలి ఘటించారు.
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు : బ్యూరో కాశీ వ్యవస్థలో చెన్నారెడ్డి తనదైన శైలిలో ప్రజా నేతగా.. నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తండ్రి కుర్చీని ఎప్పుడు లాక్కోవాలా అని కుటుంబసభ్యులు చూస్తున్న నేటి రాజకీయాల్లో.. చెన్నారెడ్డి తనయులు ఆ విధంగా కాకుండా పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని కిషన్‌రెడ్డి కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కిషన్‌రెడ్డి కొనియాడారు.
శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించారు :మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పార్టీలకు అతీతంగా శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. పాతబస్తీలో అల్లర్లు జరిగిన సమయంలో నాడు బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని కలిసిన సమయంలో చెన్నారెడ్డి స్పందించిన తీరు తాము నేటికీ మరువలేమని ఆయన గుర్తు చేశారు. చెన్నారెడ్డి రాజకీయాలకు ఆతీతంగా వ్యవహరించాలని, చెన్నారెడ్డి కలలు కన్న తెలంగాణ వచ్చిన రోజే నిజమైన తెలంగాణ వచ్చినట్లు అని ఆయన అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగిన రోజే నిజమైన తెలంగాణ వచ్చినట్లు అని రాజ్యసభ సభ్యుడు తెలిపారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ మంత్రులు మర్రి శ్రీధర్ రెడ్డి, సమరసింహారెడ్డి, చెన్నారెడ్డి తనయుడు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోదండరెడ్డి, చింతల రామచంద్రరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు మర్రి చెన్నారెడ్డి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. మర్రి చెన్నారెడ్డి వంటి నాయకుడు తెలంగాణలో ఎవరు లేరని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: