తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యవసాయ బిల్లులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు' - వ్యవసాయ బిల్లులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

వ్యవసాయ బిల్లుల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు. భవిష్యత్‌లో మార్కెట్ వ్యవస్థ, కనీస మద్దతు ధర కొనసాగుతుందని వెల్లడించారు.

'వ్యవసాయ బిల్లుల విషయంలో తప్పుడు ప్రచారం'
'వ్యవసాయ బిల్లుల విషయంలో తప్పుడు ప్రచారం'

By

Published : Oct 5, 2020, 3:48 PM IST

వ్యవసాయ బిల్లులు రైతులకు ప్రయోజనం కల్పిస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ బిల్లుల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆక్షేపించారు. భవిష్యత్‌లో మార్కెట్ వ్యవస్థ, కనీస మద్దతు ధర కొనసాగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతం రైతులు వారి బిడ్డలను వ్యవసాయ చేయమని చెప్పే పరిస్థితి లేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు మోదీ సర్కారు ఈ చట్టాన్ని చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడైనా పంటను అమ్ముకునే వీలు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని అయన పేర్కొన్నారు.

మార్కెట్‌లో దోపిడి ఆగిపోతుందనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆంధ్రప్రదేశ్ సీఎంతో సఖ్యత లేదనుకుంటే ఇప్పుడు జగన్‌తో ఉన్న సఖ్యతతో నీటి సమస్యలు పరిష్కరించుకోవచ్చు కదా అని తెలిపారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details