తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే బతుకమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ అంబర్‌పేటలో నిర్వహించిన మహిళా సదస్సుకు హాజరయ్యారు. మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు. మహిళకు ఎలాంటి సందర్భంలోనైనా రక్షణ కల్పించేందుకు దేశమంతటా ఒకే టోల్‌ఫ్రీ నంబర్ తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతితో మమేకమై రంగురంగుల పూలతో జరుపుకునే పండుగ ప్రత్యేకతను వివరించారు.
'సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే పండుగ... బతుకమ్మ' - 'సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే పండుగ... బతుకమ్మ'
హైదరాబాద్ అంబర్‌పేటలో బతుకమ్మ ప్రత్యేకత చాటుతూ నిర్వహించిన మహిళా సదస్సుకు కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
CENTRAL MINISTER KISHANREDDY ATTENDED IN MAHILA SADADSU
TAGGED:
మహిళా చైతన్య సదస్సు