లాక్డౌన్తో నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. కరోనా తగ్గుముఖం పడుతున్నందున ఎంఎంటీఎస్ రైళ్లను వెంటనే నడపాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైల్వే శాఖను కోరాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు తిరుగుతున్నాయని అన్నారు. మహారాష్ట్ర, ముంబయిలో లోకల్ రైళ్లను అక్కడి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో రైల్వే శాఖ నడిపిస్తోందని గుర్తు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేలా రాష్ట్రప్రభుత్వం రైల్వే శాఖతో చర్చించాలన్నారు.