హైదరాబాద్ న్యూ నల్లకుంట రామాలయంలో 250 మంది అర్చకులకు కోవిదా సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు... ఏ ఒక్కరూ ఆకలితో అలమటించుకూడదనే ఉద్దేశంతోనే నిత్యావసర సరుకులను అందజేసినట్లు ఆమె వివరించారు.
అర్చకులకు నిత్యావసర సరుకుల అందజేత - central minister kishan reddy wife kavya latest news
లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న అర్చకులకు కోవిదా సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి నిత్యావసర సరుకులను అందజేశారు.
![అర్చకులకు నిత్యావసర సరుకుల అందజేత kavya kishan reddy distributed daily commodities](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7418119-813-7418119-1590914157618.jpg)
అర్చకులకు నిత్యావసర సరుకుల అందజేత
గత కొంత కాలంగా నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్న కోవిదా సహృదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ అనూహ్య రెడ్డిని కావ్య కిషన్ రెడ్డి అభినందించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ నిరుపేద ప్రజలకు సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు గౌతం రావు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా