కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులు, స్వచ్చంద సంస్థలు అంకితభావంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములవుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌కు త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో నుంచి గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు.
కొవాగ్జిన్‌కు త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు : కిషన్ రెడ్డి - కొవాగ్జిన్
భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్‌కు త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు వస్తుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి
యూసుఫ్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అవగాహన పెరిగిందని.. వైరస్ తీవ్రతను అర్థం ముందుకు వస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి