కొవిడ్ బాధితులను వెలివేయడం మానవత్వం అనిపించుకోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని సూచించారు. ఆదిలాబాద్‌లో కొవిడ్ పాజిటివ్ యువతిని బహిష్కరించిన సంఘటన అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
'కొవిడ్ బాధితులను వెలివేయడం మానవత్వం అనిపించుకోదు' - కొవిడ్ వార్తలు
ఆదిలాబాద్‌లో కొవిడ్ పాజిటివ్ యువతిని గ్రామం నుంచి బహిష్కరించిన సంఘటన దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కొవిడ్ సోకినవారిని వెలివేయడం మానవత్వం అనిపించుకోదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
'కొవిడ్ వ్యాధిగ్రస్థులను వెలివేయడం మానవత్వం అనిపించుకోదు'
ఈనాడు-ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి మంత్రి స్పందించారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ అంశంపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీకి సూచిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విద్యార్థినికి కరోనా.. పొలంలో ఐసోలేషన్..!