సృజనాత్మకత, సామర్థ్యం, నాయకత్వం, మానవ వనరులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు వంటి 6 అంశాల ఆధారంగా ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కొత్త బడ్జెట్‌లో ఆత్మనిర్భర్ భారత్‌ని ఆర్థిక మంత్రి బడ్జెట్-2021లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు.
ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యం: కిషన్ రెడ్డి - తెలంగాణ వార్తలు
కేంద్ర బడ్జెట్ మోదీ ఆలోచనలకు అనుగుణంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యమేనని ఆయన స్పష్టం చేశారు.
కొవిడ్-19 మహమ్మారి నుంచి ప్రతి భారతీయుడిని కాపాడే లక్ష్యంతో, ఈ బడ్జెట్‌లో కొవిడ్ వ్యాక్సిన్ కోసం రూ.35,400 కోట్లు కేటాయించినట్లు, ప్రధాని మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యమేనని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారన్నారు. ఆర్ధిక మంత్రి కొత్తగా ప్రతిపాదించిన మెగా టెక్స్టైల్ పార్క్ పథకం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి, భారత్ వస్త్ర ఎగుమతుల కేంద్రంగా మారుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీని కింద మూడు సంవత్సరాల కాలంలో 7 పార్కులు ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు.
ఇదీ చదవండి: నిర్మలమ్మ '2021 బడ్జెట్' హైలైట్స్ ఇవే...