దేశ ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు సీఏఏలో లేవని కేంద్రం ఎన్నోసార్లు చెప్పినప్పటికీ.. విపక్షాలు మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా మోదీని, భాజపాను ఎదుర్కోలేక విపక్ష పార్టీలు మత విద్వేషాలు రెచ్చగోట్టడం మంచిది కాదని సూచించారు. సీఏఏలో మైనార్టీలకు నష్టం చేకూర్చే అంశం ఒక్కటి లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని మైనార్టీ ప్రజలు నమ్మవద్దని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
'ఒక్కరు కాదు... లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా...' - kishan reddy latest news
అమాయక ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి... రాజకీయ పార్టీలు, సంస్థలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఏఏలో మైనార్టీలకు నష్టం చేకూర్చే అంశం ఒక్కటి కూడా లేదని స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యులతో అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటిస్తే.. సీఏఏ పేరుతో శాంతి, భద్రతల సమస్య సృష్టిండం మంచి పరిణామం కాదన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయని.. ఎవరికీ నష్టం కలిగిందని సభలు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ పార్టీ, ఏ సంస్థ హింసకు పాల్పడినా, విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సంఘ విద్రోహా శక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క అసదుద్దీన్ ఒవైసీ కాదు... లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా ప్రజలకు మంచి చేసే సీఏఏ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:ట్రంప్‌తో దావత్ కోసం నేడు దిల్లీకి సీఎం కేసీఆర్