Kishan Reddy Remarks On Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫ్రంట్‌లు, టెంట్‌లు పెట్టుకోవచ్చని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి ఎలాంటి పదవులు ఉన్నా.. భాజపాకు అభ్యంతరం లేదని చురకలంటించారు. గుణాత్మకమైన పరిపాలన అంటే... కేసీఆర్ కుటుంబ పాలననా అని ప్రశ్నించారు. గుణాత్మకమైన పరిపాలన అంటే అవినితీ పాలననా? అంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ ఎనిమిదేళ్లు తెలంగాణను ఉద్దరించినట్లు మాట్లాడుతున్నారన్న ఆయన... గుణాత్మకమైన పరిపాలన అంటే కల్వకుంట్ల కుటుంబపాలననా అని నిలదీశారు.
'గుణాత్మకమైన పరిపాలన అంటే కేసీఆర్ అవినీతి పాలనా? గుణాత్మకమైన పరిపాలన అంటే అహంకారపూరితమైన పాలనా? గుణాత్మకమైన పరిపాలన అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాదన పాలననా? గుణాత్మకమైన పరిపాలన అంటే అప్పులు చేసే పాలనా? గుణాత్మకమైన పరిపాలన అంటే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాసేపాలననా? గుణాత్మకమైన పరిపాలన అంటే ఆఫీసు రాని పాలనా?గుణాత్మకమైన పరిపాలన అంటే నిజాం రాజ్యంలాంటి పాలననా? గుణాత్మకమైన పరిపాలన అంటే తండ్రి, కుమారుల పాలననా?' -- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి